మహాత్మా బసవేశ్వరుని బోధనలు ఆచరణీయం
వికారాబాద్, ఆంధ్రప్రభ : మహాత్మా బసవేశ్వరునిబోధనలు ఆచరణీయమని వీర సేవ సమాజం నాయకులు మాజీ సర్పంచ్ నులి బసవరాజ్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి బసవేశ్వర విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించిన బసవరాధన కార్యక్రమంలోమహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బసవరాజు మాట్లాడుతూ సమాజానికి బసవేశ్వరుని బోధనలు ఎంతో ఉపయోగకరమైన అన్నారు ఈ కార్యక్రమంలో వీర శైవ సమాజం అధ్యక్షులు వీరేశం భద్రప్ప దయానంద్ తదితరులు పాల్గొన్నారు
