10మంది వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ

మక్తల్ , ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మారుతి కంటి ఆసుపత్రి ఆప్టికల్స్ నిర్వాహకులు మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. పదిమంది వాహన డ్రైవర్లకు ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు. గతంలో అనేక సేవా కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంత నిరుపేదలకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారిలో అత్యంత పేదలకు ఉచితంగా కంటి అద్దాలను అందిస్తూ వస్తున్నారు . అందులో భాగంగా అర్రీవ్ అలీవ్ కార్యక్రమంలో భాగంగా 10 మంది వాహన డ్రైవర్లకు మారుతి కంటి ఆసుపత్రి ఆప్టికల్స్ నిర్వాహకులు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నెల 16న మక్తల్ పోలీస్ స్టేషన్ వద్ద వాహన డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు .30 ఏళ్ల క్రితం ప్రారంభించిన మారుతి ఆప్టికల్స్ నిర్వాహకులు కొడంగల మోహన్ భట్ ఆధ్వర్యంలో 60 మంది వాహన డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 10 మందికి కంటి అద్దాలు అవసరం అని గుర్తించారు .ఈ మేరకు శనివారం రోజు మారుతి ఆప్టికల్స్ వద్ద డ్రైవర్లకు మారుతి ఆప్టికల్ యజమాని కొడంగల్ మోహన్ భట్ ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు.

గత 30 ఏళ్లుగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన నిరుపేదలకు ఉచితంగా కంటి అద్దాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అందులో భాగంగా పోలీస్ శాఖ ఈనెల 16న వాహన డ్రైవర్లకు ఉచిత కత్తి వైద్య శిబిరం నిర్వహించిందన్నారు. ఆ సందర్భంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించాలని అవసరమైన వారికి కంటి అద్దాలను కూడా ఉచితంగా ఇస్తామని మేరకు 10 మంది వాహన డ్రైవర్లకు నేడు ఉచితంగా కడ్డీలు అందించడం జరిగింది అన్నారు. మారుతి ఆప్టికల్ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మారుతి ఆప్టికల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply