గరిడేపల్లి లో మలేరియా దినోత్సవ ర్యాలీ….

గరిడేపల్లి లో మలేరియా దినోత్సవ ర్యాలీ….

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన గరిడేపల్లి లో మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం ర్యాలీ నిర్వహించారు. ఉపకేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంటి పరిసరాల ప్రాంతాల్లో నీరు నిలువ ఉండకుండా, చెత్త కంపచెట్లు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒకరు దోమతెరలు వాడాలని దీని ద్వారా డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, జ్వరాలు రాకుండా నివారించవచ్చు అన్నారు. కార్యక్రమంలో సిహెచ్ఓ నరసింహ, హెల్త్ సూపర్వైజర్ అంజయ్య, రమణ, బిల్ కలెక్టర్ రావుల వెంకన్న, ఏఎన్ఎం కవిత, అంజలి, ఆశా కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.