ముఖ్యమంత్రి, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

మక్తల్ , ఆంధ్రప్రభ ; రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర,పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ,ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత చిత్రపటాలకు ఆర్యవైశ్యులు పాలాభిషేకం నిర్వహించారు. ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడం పట్ల శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఆర్యవైశ్యులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అక్కడే ముఖ్యమంత్రి మంత్రి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ చిత్రపటాలకు పాలభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించడం వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

నెలల రోజుల క్రితం వాసవి మాత పారాయణం సందర్భంగా సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత ఆర్యవైశ్యుల పక్షాన చేసిన విజ్ఞప్తి మేరకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వాసవి మాత జయంతికి నాలుగు రోజుల ముందు అధికారిక ప్రకటన ఇవ్వడం హర్షనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు రుణపడి ఉంటారని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర నాయకులు మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్ కుమార్ గుప్తా, నాయకులు మనసాని వెంకటేష్, దొంత నరహరి,కల్వ శ్రీనివాస్, బిలకంటి జగతహదీష్ , మనసాని నాగరాజు, బిలకంటి నరసయ్య, మేడిశెట్టి హరికృష్ణ ,ఆంద్యాల జనార్దన్,ఓ.ఉదయ్ ,బి.రామకృష్ణ, మనసాని సరళ, కల్వాల ప్రసన్న కిషోర్, పాలుట్ల సుష్మ, చల్లా రూప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply