20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్
20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్
- మంత్రి వాకిటి శ్రీహరికి వినతి పత్రం అందజేత…
మక్తల్, ఆంధ్రప్రభ : ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ ల ఒకరోజు బంద్ పై మక్తల్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి ఆదివారం రోజు మక్తల్ లోని ఆయన నివాసంలో వినతి పత్రం అందించారు. ఆన్ లైన్ లో మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల వినియోగంను నివారించాలని, దీంతో సరైన పద్దతి లో వైద్యం అందకపోవడం, నకిలీ బెడద ప్రమాదం ఉందని, ఆన్ లైన్ నుంచి మందుల అమ్మకాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈనెల 20వ తేదీన జాతీయస్థాయిలో మెడికల్ షాపుల బంద్ కు సహకరించాలని మంత్రిని కోరినట్టు మక్తల్ పట్టణ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు తెలిపారు. వినతి పత్రం అందించిన వారిలో ఉమ్మడి జిల్లా మెడికల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఖాజా మొయినుద్దీన్, టౌన్ అసోసియేషన్ సెక్రటరీ సుధాకర్ తదితరులు ఉన్నారు.
