ఉపాధి కూలీలకు గాయాలు

ఉపాధి కూలీలకు గాయాలు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : పాల వాహనం డీకొని ఉపాధి కూలీలకు గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జయపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు చింతరెడ్డి చెన్నారెడ్డి, నెలకుర్తి యాకయ్యలు పనులు ముగించుకుని మోటార్ సైకిల్ పై తిరిగి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న పాల వాహనం వెనుక వైపు ఢీ కొన్నట్లు తెలిపారు. దీంతో మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తికి, వెనుక కూర్చున్న వ్యక్తి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహనం సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ దయాకర్, పైలట్ బండపల్లి రవిలు సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు.