Devarkadra ఎస్ఐగా జి. భాస్కర్ రెడ్డి…
Devarkadra ఎస్ఐగా జి. భాస్కర్ రెడ్డి…
- ప్రజలకు అందుబాటులో ఉంటానన్న నూతన ఎస్సై
దేవరకద్ర, ఆంధ్రప్రభ: దేవరకద్ర పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా జి. భాస్కర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. దేవరకద్ర ఎస్సైగా విధులు నిర్వహించిన నాగన్న బదిలీపై భూత్పూర్ ఎస్సైగా వెళ్లగా, మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఎస్సైగా ఉన్న జి. భాస్కర్ రెడ్డిని దేవరకద్రకు బదిలీ చేశారు.
ఈ నేపథ్యంలో దేవరకద్ర పోలీస్ స్టేషన్‌లో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జి. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, దేవరకద్ర మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై జి. భాస్కర్ రెడ్డిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
