నిఘా నీడలో కేసముద్రం 11వ వార్డు..

నిఘా నీడలో కేసముద్రం 11వ వార్డు..

సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన
రూ. 1లక్ష 2 వేల విలువైన 12 కెమెరాల కౌన్సిలర్ ఆగే రామన్న ఏర్పాటు
అభినందించిన సీఐ, ఎస్సైలు

కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపల్ ఎన్నికల హామీల్లో భాగంగా కేసముద్రం మున్సిపాలిటీ 11వ వార్డు కౌన్సిలర్ ఆగే రామన్న ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 1 లక్ష 2 వేల విలువైన 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అందరికి ఆదర్శనంగా నిలిచారు. ఈనేపథ్యంలో కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని 11 వార్డు పరిధిలోని ఆదర్శ నగర్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ క్రింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ సత్యనారాయణ ఆదేశాలమేరకు బుధవారం ఎస్సై క్రాంతి కిరణ్ తన బృందంతో పరిశీలించారు.

ఈసందర్బంగా ఎస్సై మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాతో నేర నియంత్రణకు చెక్ పెట్టొచని, అదేవిదంగా సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతంలో ఎవరైనా చట్టావ్యతిరేక కార్యకలాపాలు సాగించాలన్న బయప డాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు, ఇటు పోలీసులకు తన వంతు సహకారం అందించిన 11 వార్డు కౌన్సిలర్ ఆగే రామన్నను ఈసందర్బంగా పోలీసుల తరుపున అభిందించారు.

అదేవిదంగా కౌన్సిలర్ రామన్న ను ఆదర్శనంగా తీసుకోని మిగితా వార్డు కౌన్సిలర్లు తమ వంతుగా వారి వారి వార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరానియంత్రణకు వారు సైతం సహకారం అందించాలని ఈసందర్బంగా ఎస్సై కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీటీసీ ఆగే మంజుల వెంకన్న, మాజీ వార్డ్ మెంబర్ బిర్రు వెంకన్న, రొడ్డ రాజు, బోడ రవి, ఆగే దేవేందర్, ఆగే శ్రీను, దరవాత్ బీమ తదితరులు పాల్గొన్నారు.