హిందూ సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ
హిందూ సమ్మేళనం కరపత్రిక ఆవిష్కరణ
తొర్రూరు, ఆంధ్రప్రభ : ఈ నెల 3న పట్టణంలో జరిగే హిందూ సమ్మేళనం ను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ కుందూరు రాజేందర్ రెడ్డి అధ్యక్షతన కరపత్ర ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి సభ్యులు తమ్మెర లక్ష్మీ నరసింహారావు తదితరులు మాట్లాడుతూ దేశానికి హిందూ ధర్మం హిందూ సంస్కృతి ఐక్యతను తెలియజేసేందుకు హిందూ సమ్మేళనమును రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఇందులో భాగంగా తొర్రూర్ పట్టణంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేశామన్నారు.
హిందూ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకు ఏకమవ్వాల్సినసమయం ఏర్పడిందన్నారు. హిందూ మతం కాదని హిందూ ధర్మం అని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ సమాజం పట్ల గౌరవభావం స్వధర్మం పట్ల అంకితభావం సేవ గుణాలను వికసింప చేయడమే లక్ష్యంగా ఈ సమ్మేళనం జరుగుతుందని డివిజన్ వ్యాప్తంగా ఉన్న హిందు బంధువులందరూ అధిక సంఖ్యలో వేలాదిగా పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. హిందూ ధర్మ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా శ్రీశ్రీశ్రీ సద్గురు మహాదేవ్ స్వామీజీ, ప్రధాన వక్తగా మాదిరాజు రత్నాకర్, ఒక ప్రముఖ మహిళా వక్త హాజరుకానున్నారు.
ఈ హిందూ సమ్మేళన ఆహ్వాన కరపత్ర ఆవిష్కరణ లో ఈ కార్యక్రమంలో గుజరాతి శివకుమార్, అనుమాండ్ల మోహన్ రెడ్డి, మచ్చ సురేష్ చలువాది సత్యనారాయణ మాశెట్టి రమేష్ కొనుగంటి కృపాకర్ రాజు,ఇమ్మడి రాంబాబు ప్రొద్దుటూరు రుద్రదేవ్,నాళ్ల కృష్ణమూర్తి వీరభద్రరావు సంతోష్ శర్మ , రమేష్ శర్మ,ధరావత్ కిషన్ నాయక్ తూర్పాటి వెంకటేశ్వర్లు, దారం కుమారస్వామి పేర్ల ముత్తయ్య వీరస్వామి, బోనగిరి పాండురంగ, రేపూరి శ్రీనివాస్ కుందూరు గీతారెడ్డి తమ్మెర శారద, జమున,అన్నపూర్ణ ప్రసూన సుందర సత్సంగ్ వికాస తరంగిణి సభ్యులుతదితరులు పాల్గొన్నారు.
