నిర్మాణ‌ పనులు త్వర‌గాపూర్తి చేయాలి

నిర్మాణ‌ పనులు త్వర‌గాపూర్తి చేయాలి

కలెక్టర్ కుమార్ దీపక్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గంలో నిర్మాణా దశలో ఉన్న ప్రభుత్వ భవనల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఇవ్వాళ సందర్శించారు.మండలంలోని కిష్టంపేటలో గల డిగ్రీ కళాశాల లో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

చెన్నూర్ పట్టణంలో చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణాన్ని పరిశీలించి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం లో చేపట్టిన అదనపు గదుల నిర్మాణం, భోజనశాల, వంటశాల లను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎం పి ఎస్ ఓ ప్రవీణ్ కుమార్, ఫీల్డ్ ట్రైనర్లు సురేందర్, గోపికృష్ణ, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply