ప్రజలకు మంచి చేయడమే మా ల‌క్ష్యం..

ప్రజలకు మంచి చేయడమే మా ల‌క్ష్యం..

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడివాడ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
అభివృద్ధిలో రాజకీయాలు ఉండవు…
అక్టోబర్ కల్లా ప్రధాన రోడ్లవైపు… ఫ్లై ఓవర్ బ్రిడ్జి, సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు పూర్తి
నిర్మాణం పూర్తయిన వైపు రాకపోకలకు అనుమతి….
రూ.1.17 కోట్లతో పార్కు అభివృద్ధి పనులు…
ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన తారు కొరతతో….ప్రధాన రోడ్ల పనులు ఆలస్యం

గుడివాడ – ఆంధ్రప్రభ : ప్రజలందరికీ మంచి చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు ఉండవనీ ఆయన స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో జరుగుతున్న కీలక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు.

ప్రధానంగా రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జి, మున్సిపల్ పార్క్ నిర్మాణ పనులు, రోడ్ల అభివృద్ధి పనుల ప్రోగ్రెస్‌ను అధికారులతో కలిసి సమీక్షించాను. అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా, పూర్తి నాణ్యతతో నిర్ణీత సమయానికల్లా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే రాము ఆదేశించారు. సమస్యలు తలెత్తితే నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు ఆయన సృష్టించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… అన్ని అనుమతుల తర్వాత రైల్వే గేట్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు సమయానికి జరిగిన,గేట్ల వద్ద రైల్వే శాఖ సాంకేతిక విభాగాల అనుమతులు, కారణంగానే ముందుకు సాగలేదన్నారు.

అక్టోబర్ నాటికి మచిలీపట్నం, బైపాస్ రోడ్ల వైపు నిర్మాణ పనులు పూర్తవుతాయని వెల్లడించిన ఎమ్మెల్యే రాము అప్పటికల్లా సర్వీస్ రోడ్లను కూడా నిర్మిస్తామని, బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన వైపు రాకపోకలకు అనుమతించే అవకాశం ఉంటుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, పచ్చదనం అన్నీ ఉండేలా చేసిన డిజైన్ తో రూ.1.17 కోట్లతో పార్కుని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. అభివృద్ధి పనులన్నీ పారదర్శకంగా, నాణ్యతతో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్వయంగా అభివృద్ధి పనులు పరిశీలిస్తున్నామని, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన తాను కొరత కారణంగా ఆర్డీవో కార్యాలయ, కార్ స్టాండ్ రోడ్ల నిర్మాణ పనులు కొంత ఆలస్యం అయ్యాయని, ఆ సమస్యను కూడా పరిష్కరించామని త్వరలో రోడ్ల పనులు ప్రారంభమవుతాయన్నారు.

ఎన్.హెచ్ డి.ఈ సత్యనారాయణ, ఏఈ శరత్ చంద్ర, గుడివాడ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, టిడిపి నాయకులు గోకవరపు సునీల్, యాక్కలి మణిదీప్ పలువురు అధికారులు, అభివృద్ధి పనుల పరిశీలనలో పాల్గొన్నారు.

Leave a Reply