Association | టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా

Association | టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా
Association | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగుగా, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ నియామకంపై ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆనందం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన అసోసియేషన్ ప్రెసిడెంట్, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం, సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

క్రీడా మౌలిక సదుపాయాల పెంపు, శిక్షణా శిబిరాల ఏర్పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఇకపై తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, క్రీడా రంగంలో రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని ఉప్పల శ్రీనివాస్ గుప్తా స్పష్టం చేశారు.
CLICK HERE TO READ MORE : 90Yrs | మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
