60elderly man | ఇసుక ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి..

60elderly man | ఇసుక ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి..
60elderly man | తిమ్మాపూర్, ఆంధ్ర ప్రభ : మండలంలోని సుభాష్ నగర్ స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై ఇసుక ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ వద్ద టీవీఎస్ ఎక్సెల్ బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇంద్రనగర్ కు చెందిన అలువాల అంకయ్య (60)అనే వృద్దుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇసుక ట్రాక్టర్ ఓవర్ స్పీడ్ వెళ్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు.సంఘటన స్థలానికి ఎల్ ఎం డి పోలీసులు వెంటనే వచ్చి మృతి చెందిన వృద్ధుడిని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. వివరాల ప్రకారం ఎల్ఎండిఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

