ఏస్ఏఫ్‌ఐ నాయకుల ముందస్తు అరెస్ట్..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : సిద్దిపేటలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బెజ్జంకి మండలానికి చెందిన ఎస్.ఎఫ్.ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

మండల ఎస్.ఎఫ్.ఐ కార్యదర్శి బొమ్మిడి సాయికృష్ణతో పాటు ఇతర నాయకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం పూర్తిగా నియంతలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

అక్రమ అరెస్టులతో విద్యార్థుల సమస్యలపై సాగిస్తున్న తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు తమకు కొత్తేమీ కాదని, ఎన్ని అరెస్టులు చేసినా మరింత ఉత్సాహంతో పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ ఘటనలో ఎస్.ఎఫ్.ఐ నాయకులు ఎం. మహేష్, బొణగం ప్రదీప్ భోషా, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.