రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలు వాయిదా
చల్లపల్లి, ఆంధ్రప్రభ ; ఈ నెల 21,22,23 తేదీలలో చల్లపల్లి లో నిర్వహించాల్సిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలు వాయిదా పడినట్లు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుత్తికొండ రామరావు తెలిపారు. చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరావు వికాస కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని అనివార్య కారణాల వల్ల రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశాలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరల ఎప్పుడు నిర్వహించేది తరువాత తెలియ పరుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్, రైతు సంఘం సీనియర్ నాయకులు హనుమానుల సురేంద్ర నాధ్ బెనర్జీ, వేమూరి రత్నగిరి రావు, దాసరి చంటి పాల్గొన్నారు.
