బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ..

బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ..

  • అందరి పండుగ మహానాడు..
  • విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని
  • ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతోత్సవాలు
  • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, ఆంధ్రప్రభ : టీడీపీ బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో స్వర్గీయ నందమూరి తారక రామ రావు 103వ జయంతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొని స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ తెలుగువారందరికీ పండుగరోజు మహానాడు అని పేర్కొన్నారు.

కేవలం తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగు దేశం పార్టీని స్థాపించారని తెలిపారు. పటేల్-పట్వారీ వ్యవస్థలను రూపుమాపి సామాన్య ప్రజలకు న్యాయం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని కేశినేని చిన్ని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని తగ్గించి జాతీయ స్థాయిలో ఫ్రంట్ రాజకీయాలకు దారితీసిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

అన్న ఎన్టీఆర్ ఆశయాల బాటలోనే చంద్రబాబు నాయుడు పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. నారా లోకేష్ పాత తరం, నవతరం, యువతరాన్ని సమన్వయం చేస్తూ పార్టీని విజయపథంలో నడిపిస్తున్న నాయకుడని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి Y. S. జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేసిన కేశినేని చిన్ని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.

Leave a Reply