సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం
- యువకుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
- బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్
సూర్యాపేట, ఆంధ్రప్రభ : టాక్టర్ బైకు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమవారిగూడెం సమీపంలో చోటుచేసుకుంది. కాసరాబాద గ్రామానికి చెందిన కల్లు సందీప్ మిత్రునితో సూర్యాపేట వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను డికొన్నారు. ఈ ప్రమాదంలో సందీప్ తల చిద్రమై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మిత్రుడికి తీవ్ర గాయాలు కాగా మృతదేహాన్ని, సందీప్ మిత్రున్ని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.

