ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి ఆదర్శనీయుడు

ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి ఆదర్శనీయుడు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని భూధాన్ పోచంపల్లి మండలానికి చెందిన ప్రథమ భూదాత వెదిరే రామచంద్రారెడ్డి అందరికీ ఆదర్శనీయుడని తెలంగాణ రెడ్డి సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. భూదానోధ్యమం 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమంను పోచంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. భారత దేశ చరిత్రలో భూదానోద్యమానికి మొదటి అడుగు వేసి, అందరికి ఆదర్శంగా నిలిచిన మహనీయులు వెదిరే రామ చంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
భూదాన్ రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు మాట్లాడుతూ.. భూదాన ఉద్యమంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో పాటు యాదాద్రి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు ఎన్నెపల్లి లింగారెడ్డి, నాయకులు పాటి యాదిరెడ్డి, మన్నె నర్సింహారెడ్డి, మల్లేపల్లి ప్రముఖ రెడ్డి, బండారు ప్రకాష్ రెడ్డి, మన్నె రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
