అందుగుడలో పోషణ పక్వాడ్ కార్యక్రమం

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రాజెక్ట్ జంగం సెక్టార్ లోని పట్నాపూర్ పంచాయతీలోని అందుగూడ అంగన్వాడీ సెంటర్ లో శనివారం పోషణ పాక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న పట్నాపూర్ సర్పంచ్ కందారే లక్ష్మి బాలాజీ, సిడిపిఓ సంధ్యారాణిలు మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలు పోషకాహార పదార్థాలు తీసుకోవాలని కోరారు.
తల్లులకు పిల్లలకు పోషకా హర విషయాలు గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు. తల్లిపాల గురించి ప్రీ స్కూల్ గురించి బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనివార్యం గురించి, ఎండా కాలంలో వడదెబ్బలు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్నాపూర్ సర్పంచ్ కందారే లక్ష్మి బాలాజీ, ఉప సర్పంచ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సంధ్యారాణి, అంగన్వాడీ టీచర్స్ విమల,వనిత గర్భిణీ మహిళలు, బాలింతలు మహిళలు పాల్గొన్నారు.
