బాధిత కుటుంబాలకు అండగా ఎస్‌ఆర్ ఆర్ ఫౌండేషన్

బాధిత కుటుంబాలకు అండగా ఎస్‌ఆర్ ఆర్ ఫౌండేషన్

రాయపర్తి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సేవా దృక్పథంతో బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. మండలం లోని,శివరామాపురం గ్రామ సుభాష్ తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ బాలు తల్లి మంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం అనారోగ్యంతో ఇటీవల చికిత్స తీసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న 1) బాధవత్ బక్కులు, 2) బాధవత్ లచ్చు లను పరామర్శించి ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సురేందర్ రాథోడ్ నాయక్, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, తాళ్లపల్లి సంతోష్ గౌడ్,ఐత రామ్ చందర్, నాగపూరి సోమన్న, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, మాజీ సర్పంచ్ చెడుపాక కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు భూక్య జగన్, పార్టీ నాయకులు మేకల మహేష్, ప్రవీణ్, సర్వన్, సుమన్, శ్రీనివాస్, రవీందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply