పరకాలలో బిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన నాయకులకు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

బిజెపిలోకి చేరిన వారిలో బిఆర్ఎస్ వార్డు మెంబర్ తాళ్ల మురళి, గ్రామ కార్యదర్శి తక్కలపల్లి కిరణ్, యూత్ అధ్యక్షులు బండి శివ, ప్రధాన కార్యదర్శి మారబోయిన సదానందం, ముదిరాజ్ కుల పెద్దమనిషి ఐరాబోయిన స్వామితో పాటు బొజ్జం వంశీ, ఎండి అంజాద్, గుర్రం నాగరాజు, తక్కలపల్లి మొగిలి వంటి ముఖ్యులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో పరకాల రూరల్ మండల అధ్యక్షుడు కాసాగాని రాజకుమార్, గీసుకొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్, సంగెం మండల అధ్యక్షుడు దామరుప్పుల చంద్రమౌళి పాల్గొన్నారు. ఈ భారీ చేరికలతో పరకాల నియోజకవర్గంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయని, రాబోయే రోజుల్లో డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు నాయకత్వంలో పరకాలలో బిజెపి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వారు భావిస్తున్నారు.

Leave a Reply