మధిర సమీపంలో ట్రాక్టర్ బోల్తా..

మధిర సమీపంలో ట్రాక్టర్ బోల్తా..
- మహిళ మృతి, 10 మందికి గాయాలు
మధిర, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం తాళ్లూరు సమీపంలో కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ శుక్రవారం బోల్తా పడింది.
మిరపకాయలు కోయడానికి మడుపల్లి నుంచి కూలీలు ట్రాక్టర్‌లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లో మొత్తం సుమారు 20 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వేల్పుల అన్నపూర్ణమ్మ అనే మహిళ మృతి చెందగా, మరో 10 మంది కూలీలు గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
