Balakrishna | ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పారా..?

Balakrishna | ఆ డైరెక్టర్ కి ఓకే చెప్పారా..?

Balakrishna | మోక్షజ్ఞ ఎంట్రీపై పెరుగుతున్న ఆసక్తి
వశిష్ట్ కథలో జరిగిన ట్విస్ట్
బాలయ్యతో కొత్త ప్రాజెక్ట్ టాక్
ఎంట్రీపై కొనసాగుతున్న సందేహాలు

Balakrishna | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. సినిమా సెట్స్ పైకి రావడం లేదు. తాజాగా మోక్షజ్ఞ కోసం కథ చెబితే.. బాలయ్య తన కోసం కథ రెడీ చేయమన్నారట. ఇలా మోక్షజ్ఞ కోసం అనుకుంటే.. బాలయ్యతో ప్రాజెక్ట్ సెట్ అయ్యిందట. ఇంతకీ.. ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు ఏం జరిగింది..? మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..? ఉండదా..?

Balakrishna | మోక్షజ్ఞ కోసం కథ రెడీ చేస్తే..

Balakrishna

టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అది ఏంటంటే.. మోక్షజ్ఞ కోసమని కథ రెడీ చేసి దర్శకుడు వశిష్ట్ చెబితే.. ఆ కథ పక్కనపెట్టి తనతో సినిమా చేయమని సూచించారట బాలయ్య. అప్పుడు బాలయ్య కోసం కథ రెడీ చేయడం.. స్టోరీ నెరేట్ చేస్తే బాగుందని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఈ వార్త వైరల్ అయ్యింది. అలాగే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ప్రశాంత్ వర్మతో చేయాలి అనుకున్నారు కానీ.. క్యాన్సిల్ అయ్యింది. ఆతర్వాత క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదు.

Balakrishna | బాలయ్యతో వశిష్ట్..

Balakrishna

ఇప్పుడు మోక్షజ్ఞ కోసం మల్లిడి వశిష్ట్ కథ రెడీ చేస్తే.. ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదట. అసలు నిజం ఏంటి? అంటే.. ఈ వార్తల పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ వశిష్ట్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆలోచనలో ఉన్నారని సమాచారం. బాలయ్యతో సినిమా చేసే అవకాశం వస్తే, అది భారీ ప్రాజెక్ట్‌గా మారే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వశిష్ట్ ప్రస్తుతం చిరంజీవితో తెరకెక్కించిన విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని జులై 10న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది.

Balakrishna | మోక్షజ్ఞ ఎంట్రీ ఉండదా..?

Balakrishna

ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఒకవేళ బాలయ్య – వశిష్ట్ కాంబినేషన్ సెట్ అయితే భారీగా క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు. మరో వైపు మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడు అనేదాని పై కూడా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం.. ఇవన్నీ ఊహాగానాలే అయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ పై క్లారిటీ వస్తే.. టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది. మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండడంతో అసలు బాలయ్య నట వారసుడు ఎంట్రీ ఉంటుందా..? ఉండదా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. బాలయ్య త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Balakrishna

Leave a Reply