ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ ఫలితాలు

కడెం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కడెం మండల విద్యాశాఖ అధికారి షేక్ హుస్సేన్ అన్నారు. గురువారం కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండ్ ఇయర్ చదివి ఇటీవల పరీక్ష ఫలితాల్లో వెయ్యి 932 మార్కులు సాధించి టాపర్ గా నిలిచిన బొమ్మెన విద్యాసాగర్ కు ఎంఈఓ షేక్ హుస్సేన్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బి.రాజేష్ నాయక్ శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అధ్యాపకుల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులకు మంచి విద్యాబోధన అందుతుందన్నారు.
విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ కళాశాలలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కడెం ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం మధురవాణి, ఎంపీ యూపీఎస్ ఉర్దూ మీడియం పాఠశాల హెచ్ఎం షేక్ మేహరిన్, టీచర్ ఆయేషా, స్థానిక అంగన్వాడీ కేంద్రం టీచర్ నేరెళ్ల గంగమని, హెల్పర్ శ్రీ వాణి తదితరులు పాల్గొన్నారు.
