బాసర ఆలయంలో చోరీ

బాసర ఆలయంలో చోరీ

మహాకాళి ఆలయ తాళాలు పగలగొట్టి వెండి కిరీటం ఇతర ఆభరణలు చోరీ
దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బాసర ( నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర అమ్మ వారి ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ఆలయ పరిధిలోని మహాకాళి ఆలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి వెండి కిరీటం ఇతర ఆభరణాలు దోచుకెళ్లరు. తెల్లవారుజామున మహాకాళి అమ్మవారి అభిషేక సేవకు వెళ్లిన అర్చకులు అమ్మవారి ఆలయ తాళాలు పగలగొట్టిన దృశ్యాలు చూసి ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

ఆలయ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. హుండీని ఎత్తు కెళ్ళి తాళాలు పగలగిట్టి డబ్బులు తీసుకొని హుండీని వ్యాస మందిరం వద్ద వదిలిపోయారు. క్లూస్ టీం వివరాలను సేకరిస్తున్నారు. మహాకాళి ఆలయానికి భక్తుల దర్శనాలకు అనుమతి ఇవ్వడం లేదు. సిసి కెమెరాలకు బట్ట కప్పి చోరికి పాల్పడినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.