Central Govt | దేశవ్యాప్తంగా ఉత్కంఠ

Central Govt | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ రాజకీయాలను ప్రభావితం చేసే మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెడుతోంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంశాలతో ఈ బిల్లులపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్న మూడు ప్రధాన బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెడుతోంది. మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), కొత్త డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలు ఈ బిల్లుల్లో ఉన్నాయి.

ఈ బిల్లులపై ఒక్కో సభలో సుమారు 18 గంటల పాటు చర్చకు అవకాశం ఇవ్వనున్నారు. దీంతో పార్లమెంట్‌లో విస్తృత చర్చలు జరిగే అవకాశముంది. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ బిల్లులపై ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది.

ముఖ్యంగా డీలిమిటేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా? లేక ప్రతిపక్షాల వ్యతిరేకతతో నిలిచిపోతుందా? అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply