పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు
పంటలు ఉత్పత్తి పెంచుటకు పుష్కల అవకాశాలు
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు సత్యనారాయణ
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ఉత్తర కోస్తా జిల్లాల పంటల ఉత్పత్తి పెంచుటకు పుష్కలంగా అవకాశాలు కలిగి ఉన్నాయని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు పివి సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధనా, విస్తరణ సలహా మండలి సమావేశంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరకొస్తా జిల్లాలలో సాగు చేస్తున్న పంటల ఉత్పాదకత తక్కువగా ఉన్నప్పటికీ నూతన సాంకేతిక పద్ధతుల ఉపయోగించుట ద్వారా వివిధ పంటలలో ఉత్పాదగత పెంచుటకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సలహా మండలి కార్యక్రమం ద్వారా గత సంవత్సరం వ్యవసాయ పరిశోధన సాధించి ప్రగతిని విస్తరణ విభాగమైన వ్యవసాయ శాఖ అధికారులకు వివరించి రైతుల వద్దకు పరిశోధన ఫలితాలు చేర్చుటకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుందన్నారు.

వివిధ పంటలలో సాధించిన పరిశోధనలు రైతులకు చేరవేయుట ద్వారా ఉత్తర కోస్తాలో వివిధ పంటల ఉత్పాదన పెంచవచ్చన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకుల ప్రతినిధిగా పాల్గొన్న ఏవి రమణ మాట్లాడుతూ, ఉత్తర కోస్తా జిల్లాలో ముఖ్యంగా తేలిక నేలలు తక్కువ భూసారం కలిగి ఉండటం వలన నేలలో కార్బన్ శాతాన్ని పెంపొందించుటతో పాటు జీవన ఎరువులు విస్తృతంగా వాడుట ద్వారా భూసారాన్ని పెంపొందించడంతో పాటు ప్రధాన వరి పంటతో పాటు రెండవ పంటగా అపరాలు నూనె గింజల సాగు ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చుని తెలిపారు.
కార్యక్రమంలో నాబార్డ్ ఏజీఎం రవి కృష్ణ మాట్లాడుతూ, వివిధ వ్యవసాయ పరిశోధనలకు వ్యవసాయ యాత్రీకరణకు డ్రోన్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగ ఉపయోగించుట ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. జిల్లా ద్వారా ఎఫ్ పి ఓ ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. వ్యవసాయ శాఖ తరపున శ్రీకాకుళం డి ఎ ఓ వై వి మురళీ కృష్ణ, విజయనగరం డి ఎ ఓ శ్రీ. వి. టీ. రామారావు, అనకాపల్లి డి ఎ ఓ ప్రతినిధి వసంత కుమారి, విశాఖ జిల్లాల జిల్లా వ్యవసాయ అధికారులు ప్రసంగిస్తూ వ్యవసాయ పరిశోధనా ద్వారా సంవత్సరం అంతా నేలలను పచ్చని పంటలతో సాగు చేయడంతో పాటు డ్రోన్ పరిశోధనల ద్వారా తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో ఎక్కువ పొలాలను కవర్ చేస్తూ రైతులకు వ్యవసాయము లాభసాటిగా ఉండే సాంకేతికతలను రూపొందించి విశ్వవిద్యాలయం రైతులుకు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉత్తర కోస్తా జిల్లాల నుండి అన్ని పరిశోధన స్థానాలు విస్తరణ కేంద్రాల శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొని వివిధ పంటలలో చేపట్టవలసిన పరిశోధనలు చర్చించి 2026 – 27 సంవత్సరంనకు కావలసిన కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యక్రమం 16వ తేదీన కూడా జరుగుతుందని, ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర జిల్లాల నుండి అభ్యుదయ రైతులు పాల్గొని అనేక అంశాలు చర్చించారు. వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడిఆర్ డాక్టర్ సి.హెచ్ ముకుందరావు సమన్వయ పరిచారు.
