అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్

అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలని ఉద్దేశంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్ లను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా ఉరవకొండ పట్టణంలో బుధవారం దాదాపు 61 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడమే పరమా వధిగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నిరుపేదలకు, కేవలం రూ.5కే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమనానికి కట్టుబడి ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం, కొంతమంది ముఖ్యమంత్రులు కొంతవరకు అభివృద్ధి పనులు చేపట్టారన్నారు.
5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. నియోజవర్గంలో నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. 100 రోజుల్లో హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు.
అన్నా క్యాంటీన్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి అఖిల, డి ఎల్ పి వో విజయలక్ష్మి, ఎంపీడీవో రవి ప్రసాద్, తహసిల్దార్ భోగన్న గౌడ్, పెన్నాహోబిలం ఆలయ చైర్మన్ రేగటి నాగరాజు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవినేని పురుషోత్తం, ఉరవకొండ సింగల్ విండో అధ్యక్షులు ప్యారం కేశవా నంద, హాస్పిటల్ చైర్మన్ కండక్టర్ తిమ్మప్ప, నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ గౌతమ్ కుమార్, మాజీ ఎంపీపీ కుళ్లాయప్ప, మాజీ సర్పంచులు మోపిడి గోవిందు, ఇంద్రావతి వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.
