ఎంపీసీలో కుందన సాయి జిల్లా టాపర్…

ఎంపీసీలో కుందన సాయి జిల్లా టాపర్…

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు బి.క్యాంపు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని కుందన సాయి ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 982 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ సరళ దేవి వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడిన కుందన సాయి, తన విజయానికి తల్లిదండ్రుల కష్టం, అధ్యాపకుల మార్గదర్శకత్వమే కారణమని పేర్కొంది.

తన తండ్రి ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తూ ఎంతో కష్టపడి తనను చదివించారని భావోద్వేగంతో గుర్తుచేసుకుంది. కళాశాల అధ్యాపకుల కృషి, ప్రోత్సాహంతోనే మంచి ఫలితాన్ని సాధించగలిగానని ఆమె తెలిపింది. భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు మరింత శ్రమిస్తానని కుందన సాయి పేర్కొంది. కుందన సాయి సాధించిన ఈ విజయంపై కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.

Leave a Reply