గంజాయి–నాటుసారా ఆరుగురు అరెస్ట్, 30 లీటర్ల స్వాధీనం

గంజాయి–నాటుసారా ఆరుగురు అరెస్ట్, 30 లీటర్ల స్వాధీనం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కదిరి టౌన్‌లో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి సేవించి అల్లర్లు సృష్టించడం, మహిళలు/అమ్మాయిలను వేధించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి కార్యకలాపాలలో పాల్గొంటూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఆరుగురు వ్యక్తులు నాటుసారా తయారీ, అమ్మకాలలో కూడా పాల్గొంటున్నారనే సమాచారం మేరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 30 లీటర్ల నిషేధిత నాటుసారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
అరెస్టు చేసిన వారు:
షేక్ ఆరిఫ్ (28) – బాలప్పగారిపల్లి, కదిరి రూరల్
షేక్ యాసీన్ (19) – పోలీస్ లైన్, కదిరి టౌన్
నిజాముద్దీన్ @ నీగ్రో (20) – వెలుగు ఆఫీస్ సమీపం, కదిరి
ఎస్. బాబా ఫక్రుద్దీన్ @ రాయుడు (19) – గాంధీనగర్, కదిరి
పి. బాబ్ జాన్ (25) – కుమ్మర వీధి, కదిరి
వనార్చి శీను @ పిల్ల (25) – జగనన్న కాలనీ, గట్ల వద్ద, కదిరి
పోలీసులు హెచ్చరిస్తూ—రౌడీ షీట్లు నమోదైన వారు, గంజాయి సేవించి అల్లర్లు సృష్టించే వారు, మహిళలను వేధించే వారు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే PD యాక్ట్ అమలు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ కూడా విధిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply