మహారాష్ట్రలో డీసీసీ అధ్యక్ష నియామక పరిశీలకులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట

మహారాష్ట్రలో డీసీసీ అధ్యక్ష నియామక పరిశీలకులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట
జుక్కల్ , ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఏఐసీసీ అత్యంత కీలకమైన బరువు, బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో డీసీసీ కొత్త అధ్యక్ష నియామకం కొనసాగనుంది. దీనికిగాను ఏఐసీసీ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావుకు పరిశీలికులుగా నియమించడం జరిగింది. బుధవారం మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు అక్కడి ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్యే తోటకు శాలువా పుష్పగుచ్చం తో ఘనస్వాగతం పలికారు. అనంతరం డీసీసీ అధ్యక్ష నియామక పరిక్రియలో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో శ్రేణులతో కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేవారు, నిస్వార్థులు,పార్టీ కోసం పాటుపడే వారందరి నుండి డిసిసి అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఏఐసీసీ నియమ నిబంధనల ప్రకారం పారదర్శకంగా డీసీసీ అధ్యక్షునియామకం కొనసాగుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెల్పడం జరిగింది.
