Delcy Rodriguez | పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు
Delcy Rodriguez | పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు
Delcy Rodriguez | ఆంధ్ర్రప్రభ వెబ్డెస్క్ : వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Eloína Rodríguez Gómez) శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. ఆమె సాయి కుల్వంత్ మందిరంలో ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. అనంతరం జరిగిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
డెల్సీ రోడ్రిగ్జ్, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారికి వీరాభిమాని. తన దేశానికి, కుటుంబానికి కష్టకాలంలో సత్యసాయి బాబా బోధనలు, ఆయన దివ్య ఆశీస్సులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, ట్రస్ట్ సభ్యులు మనోహర్ శెట్టి తదితరులు ఘన స్వాగతం పలికారు. మహాసమాధి దర్శనం తర్వాత, ఆమె మందిరంలో కొంత సమయం ప్రార్థనలు చేసి, సాయి భజనల్లో లీనమయ్యారు. ఇండియా-వెనిజులా దేశాల మధ్య ఇంధనం, వాణిజ్యపరమైన చర్చల కోసం భారతదేశానికి విచ్చేసిన డెల్సీ రోడ్రిగ్జ్, తన పర్యటనలో భాగంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించడం విశేషం.
