పేదల ఇళ్ల కల నెరవేర్చడమే లక్ష్యం: సంపత్ కుమార్

ఇటిక్యాల, ఆంధ్రప్రభ ; పేదల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం. గడిచిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఏ గ్రామాన్ని,ఏ నిరుపేదలను,ఏ నిరుద్యోగులను గాని పట్టించుకున్న పాపాన పోలేదని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్. ఎ.సంపత్ కుమార్ మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డం పడకండి అభివృద్ధిని సాధించుకుందాం అల్లంపూర్ ను కాపాడుకుందాం అంటూ కార్యకర్తలకు, నాయకులకు సూచనలు చేశారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండల పరిధిలోని ధర్మవరం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదివారం హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టి ఇంటి యజమాని సుజాత, మహేష్ నాయుడు లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు ముందుగా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప,వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, ఎర్రవల్లి మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, నాయకులు షేక్ పల్లి నర్సిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ మధు నాయుడు, నారాయణ నాయుడు, రాజు, స్వాములు, మహేష్, చిన్న నాయుడు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరై పాల్గొన్నారు.

Leave a Reply