సమకాలీన రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో చర్చ

సమకాలీన రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో చర్చ

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో మంగళవారం కాంగ్రెస్ నాయకులు మాజీ వరంగల్ పార్లమెంట్ సభ్యులు రామసహాయం సురేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.

సమావేశంలో సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చ జరగగా, మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు పలు సలహాలు, సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాదరావు, రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుంచు సంతోష్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేరుగు మల్లేశం గౌడ్, సీనియర్ నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, బిజ్జాల వరప్రసాద్, సర్పంచులు నలుగురి రామలింగం, ధర్మారపు మహేందర్, వెల్తురు మల్లేశం, మిట్టకోల లక్ష్మణ్, గడిల పుల్లయ్య, యాకయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply