డోర్నకల్ గద్వాల రైల్వే లైను మంజూరు చేయాలని రైల్వే బోర్డ్ చైర్మన్ కు వినతి పత్రం

డోర్నకల్ గద్వాల రైల్వే లైను మంజూరు చేయాలని రైల్వే బోర్డ్ చైర్మన్ కు వినతి పత్రం

నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : న్యూఢిల్లీ లో రైల్వే బోర్డు ఛైర్మన్‌ను కలిసి, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని డోర్నకల్–గద్వాల్ రైల్వే లైన్‌కు త్వరితగతిన ఆమోదం, మంజూరు చేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లురవి ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుమారు 296 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి మరియు గద్వాల్* వంటి వెనుకబడిన మరియు తగినంత సేవలు అందని ప్రాంతాలలో అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని నొక్కి చెప్పారు.

దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే డీపీఆర్ మరియు సర్వే నివేదికను సమర్పించిందని, దీనికి త్వరితగతిన ఆమోదం, బడ్జెట్ కేటాయింపులు చేయాల ఎంపీ కోరారు. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడంలో, నిత్యావసర వస్తువుల రవాణాను మెరుగుపరచడంలో, మరియు ఈ ప్రాంతాన్ని జాతీయ ప్రధాన స్రవంతితో అనుసంధానించడంలో ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఎంపీ మల్లు రవి విశ్వాసం వ్యక్తం చేశారు .

Leave a Reply