RTC BUS | ఒకరి మృతి, 20మందికి తీవ్ర గాయాలు..

RTC BUS | ఒకరి మృతి, 20మందికి తీవ్ర గాయాలు..

RTC BUS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ-ఒడిశా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

ఏపీ-ఒడిశా సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply