ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించాలి
- ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : దళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ ధ్యేయమని, రైతులు తాము పండించిన మక్కలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్ధతు ధర పొందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.శుక్రవారం చెన్నారావుపేట పిఎసిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన ప్రతి మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.మండల రైతాంగం మక్కల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే క్వింటాలుకు రూ. 2400 మద్ధతు ధర పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,డిసివో నీరజ,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సిద్దన రమేష్,పిఏసిఎస్ నోడల్ ఆఫీసర్ ఈగ వెంకటేశ్వర్లు,తహసీల్దార్ మహ్మద్ అభిద్ అలీ,ఇంచార్జి ఎంపిడివో అయేషా పర్వీన్,ఏవో గోపాల్ రెడ్డి,మాజీ ఎంపిపి కేతిడి వీరారెడ్డి,భూక్య గోపాల్ నాయక్,సర్పంచులు కంది శ్వేతకృష్ణచైతన్య,మైదం రాకేష్,నాయకులు మంద యాకయ్య,బండి హరీష్,భూక్య సురేష్,తదితరులు పాల్గొన్నారు.
