ఘనంగా ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఎన్‌ఎస్‌యూఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్దన్ రాజు ఆదేశాల మేరకు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎన్‌ఎస్‌యూఐ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చిలుముల సాయి కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బెల్లంపల్లిలో రూ.2 కోట్లతో నూతన పీజీ కళాశాల ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాళ్ళగురిజాల సర్పంచ్ రామన్న, ఎన్‌ఎస్‌యూఐ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి యూనిస్, యూత్ కాంగ్రెస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ఏల్పుల రోహిత్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, తాళ్ళగురిజాల ఉప సర్పంచ్ డాకూరి సురేష్, రంగ ప్రశాంత్, ఎన్‌ఎస్‌యూఐ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు హజీబాబా, కన్నెపల్లి మండల అధ్యక్షుడు ప్రణయ్, నాయకులు ములుగు సురేందర్, హేమంత్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
