భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందితుడు

భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందితుడు

  • 14 ఏళ్లుగా పరారీలోనే.. అరెస్టు, రిమాండ్
  • జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : భార్య, ఇద్దరు పిల్లల మృతికి కారణమైన నిందుతుడు 14 ఏళ్లుగా పరారీలో ఉండగా, ఎట్టకేలకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పేర్కొన్నారు. శుక్రవారం కేసు వివరాలు ఎస్పీ వెల్లడించారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు (27), తండ్రి బాల నరసయ్య, 2007లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

వీరికి ఇద్దరు కుమార్తెలు శ్రీనిధి (5), నైపున్య (2) ఉన్నారు. 2012లో భాగ్యలక్ష్మి మూడవసారి గర్భవతిగా ఉన్న సమయంలో, మళ్లీ అమ్మాయి పుడుతుందని అనుమానంతో భర్త ఆంజనేయులు, అత్తమామలు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఈ వేధింపులను భరించలేక భాగ్యలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై 2012లో ఆంజనేయులుపై కేసు నమోదు కావడంతో అప్పటి నుండి ఆంజనేయులు పరారీలో ఉండగా దీంతో న్యాయస్థానం అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జిల్లా టాస్క్ ఫోర్స్, ముస్తాబాద్ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

Leave a Reply