Bihar CM | నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం…

Bihar CM | నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం…

Bihar CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులపై చర్చ మొదలైంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ (Rajya Sabha Chairman CP Radhakrishnan) ఆయనతో ప్రమాణం చేయించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో హిందీ భాషలో నితీశ్ కుమార్ ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ హాజరయ్యారు. అలాగే జేడీయూ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత జైరాం రమేష్, బీజేపీ ఎంపీలు రాజీవ్ ప్రతాప్ రూడీ కూడా పాల్గొన్నారు.

నితీశ్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో, బీహార్ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం ముగిసే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న ఎన్డీఏ కూటమి బీహార్ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరీకి సీఎం పదవి దక్కే అవకాశముందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Leave a Reply