SRH vs MI | ఆదుకున్న క్లాసెన్, అభిన‌వ్.. ముంబై ముందు స్వ‌ల్ప టార్గెట్

ఈరోజు సొంత మైదానంలో ముంబైపై జ‌రుగుతున్న మ్యాచ్ లో.. ఆరెంజ్ ఆర్మీ చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్… ముంబై ధాటికి వ‌రుస వికెట్లు కోల్పోయింది. 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా.. ఈ క్ర‌మంలో హెన్రిచ్ క్లాసెన్, అభిన‌వ్ మనోహర్ కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. దాంతో ఎస్ఆర్‌‌హెచ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది.

ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (0), ఇషాన్ కిష‌న్ (1), అభిషేక్ శ‌ర్మ‌(8), నితిష్ కుమార్ రెడ్డి (2), అనికే వ‌ర్మ (12) విఫలమవ్వగా… క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) ఆదుకున్నారు. క్లాసెన్, అభినవ్ మనోహర్ కలిసి 6వ వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇక ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ నాలుగు వికెట్లతో విజృంభించాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీయగా.. బుమ్రా, హార్దిక్ పాండ్య తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

Leave a Reply