10grams | దిగిరాని వెండి.. రూ.5వేలు హైక్‌

10grams | దిగిరాని వెండి.. రూ.5వేలు హైక్‌

10grams | ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ధరలు తగ్గినా

10grams | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గ‌త కొన్ని రోజులుగా బంగారం ధ‌ర‌లు పైపైకి పోయాయి. ఇవాళ గోల్డ్ ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డింది. గత కొద్ది రోజులుగా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ధరలు తగ్గినా.. దేశీయంగా తగ్గలేదన్న సంగతి తెలిసిందే. ఇంకా పెరిగాయి. అయితే ఇప్పుడు రూపాయి కాస్త కోలుకోగా బంగారం ధర దేశీయంగా దిగొచ్చింది. వెండి ధర మాత్రం రూ. 5 వేల మేర పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం స్వల్పంగా తగ్గాయి. దీంతో కొనుగోలుదారులు కొంత ఊరట ల‌భించిద‌ని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తోన్నాయి. ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలాయి.

హైదరాబాద్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం… 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.440 త‌గ్గింది. దీంతో ప్ర‌స్తుత ధ‌ర రూ.1,59,490 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.400 త‌గ్గి… రూ.1,46,200 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల ధర రూ.330 త‌గ్గి… రూ.1,19,620 వద్ద ట్రేడవుతోంది

ఇక వెండి ధరలు భారీగా పెరిగాయి.. ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.2.95 లక్షల వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.2.90 లక్షలుగా ఉంది. నిన్నటితో చూస్తే రూ.5 వేలు పెరిగింది.

click here to read more

click here to read Sensex | ఐటీ, గ్లోబల్ సంకేతాలతో మార్కెట్‌కు ఊపు

Leave a Reply