పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారు…

పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారు…

ఫీజు బకాయిల పై హైకోర్టు తీర్పు పునః సమీక్షించాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లా దల్ల శరత్

కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు పైన పునః సమీక్షించాలని ప్రభుత్వ హామీలతో కళాశాలలో విద్యార్థులను చేర్చుకున్నారు. ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులు గురిచేయడం సరికాదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాధల్లా శరత్ అన్నారు. గురువారం స్థానిక వరంగల్ ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఫీజు బకాయిలపై ఇచ్చిన తీర్పులో విద్యార్థుల నుండి వసూళ్లు చేసుకోమని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి విద్యార్థులకు చెల్లించాలని తీర్పు ఇవ్వడం సరైనది కాదని పేద విద్యార్థుల చదువులకు హైకోర్టు తీర్పు గొడ్డలి పెట్టు లాంటిదని తక్షణమే హైకోర్టు తీర్పును పున:సమిక్ష చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రైవేట్ కళాశాలలో ప్రభుత్వం ప్రకటించిన ఫీజు పథకం అమలు చేస్తామని అంగీకారాన్ని తెలిపి విద్యార్థులను చేర్చుకున్నారన్నారు.

అలాంటిది ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి మొట్టకాయలు వేయాల్సిన హైకోర్టే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పించి విద్యార్థుల నుండి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వసూళ్లు చేసుకోమని చెప్పడం బాధాకరమని అన్నారు. పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు నుండి ఇప్పుడే ఉన్నత విద్యలోకి వస్తున్నారని ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువుతున్న విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 15 లక్షల పైచిలుకు మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని వారికి ఈ తీర్పు వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శివ అభిరామ్ కార్తీక్ నిఖిల్ వంశి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply