రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు జిల్లా జట్టు ఖరారు…
రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీలకు జిల్లా జట్టు ఖరారు…
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : రాష్ట్రాస్థాయి జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్ జిల్లా జట్టును ఖరారు చేశారు. ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో జూనియర్ గర్ల్స్ హాకీ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎంపికలకు మొత్తం 40 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 18 మందితో తుదిజట్టును ఎంపిక చేసినట్లు నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విశాఖ గంగారెడ్డి సదమస్తులు రమణ తెలిపారు.
ఎంపికైన జట్టు ఈ నెల 10, 11, 12 తేదీలలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గోనే లహరి రఘు, వైస్ చైర్మన్ కాట్పల్లి వెంకటరెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ గోనే లహరి రఘు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారిణులకు అభినందనలు తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న క్రీడా కోటాను సద్వినియోగం చేసుకొని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి మాట్లాడుతూ క్రీడాకారిణులు క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంటూ రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాకు మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఎంపికైన జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సోను, ఫిజికల్ డైరెక్టర్లు సడక్ నాగేష్, సంతోష్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు బొగడమీది భరత్, కొంతం పూర్ణచందర్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
