గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

15లీటర్ల గుడుంబా స్వాధీనం, ఒకరి పై కేసు నమోదు ,
ఎస్సై సతీష్ వెల్లడి,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పాసిగడ్డ తండాలో గుడుంబా తయారు చేస్తున్న స్థావరాల పై మంగళవారం చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్, తమ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. గుడుంబా తయారు చేస్తున్న లావుడ్య సమ్మయ్య, (అలియాస్ తైలాల్) అదుపులోకి తీసుకుని, అతని వద్ద 15 లీటర్ల గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గుడుంబా తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని సంఘటనా స్థలంలోనే పోలీసులు ధ్వంసం చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సై సతీష్ వెల్లడించారు.​ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ యాకయ్య, కానిస్టేబుల్స్ లాల్ సింగ్, రంజిత్, రాజు, హోమ్ గార్డ్ రాజయ్య పాల్గొన్నారు.

Leave a Reply