పిస్టల్, రైఫిల్ షూటింగ్.. కప్.. గెలిచేది ఎవరు…?

పిస్టల్, రైఫిల్ షూటింగ్.. కప్.. గెలిచేది ఎవరు…?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అంతర్జాతీయ షూటింగ్ క్రీడల్లో ప్రతిష్ఠాత్మకంగా భావించే పిస్టల్‌, రైఫిల్‌ షూటింగ్ ప్రపంచకప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలోని పలు దేశాల షూటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. అయితే.. భారత జట్టులో తెలంగాణకు చెందిన ధనుష్ శ్రీకాంత్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముకేష్ నేలవల్లి పాల్గొనడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో పిస్టల్‌, రైఫిల్ విభాగాల్లో వివిధ ఈవెంట్లు నిర్వహించనున్నారు. భారత షూటింగ్ జట్టు మంచి ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత షూటర్లు మెరుగైన ఫలితాలు సాధించడంతో ఈ టోర్నీపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలంగాణకు చెందిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ తన ప్రతిభతో ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. స్థిరమైన ప్రదర్శనతో పతకం పై కన్నేశాడు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముకేష్ నేలవల్లి కూడా తన ప్రతిభతో జట్టులో స్థానం సంపాదించి ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీ భారత షూటర్లకు కీలకంగా మారనుంది. రాబోయే అంతర్జాతీయ పోటీలకు ఇది మంచి అనుభవాన్ని అందించనుందని కోచ్‌లు భావిస్తున్నారు.

పిస్టల్‌, రైఫిల్ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ప్రపంచకప్ పోటీల్లో భారత జట్టు ప్రదర్శనపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన షూటర్లు పాల్గొనడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తోంది. అయితే.. ఈ పోటీల్లో ఏపీ నుంచి పాల్గొంటున్న ముకేష్‌ నేలపల్లి, తెలంగాణ నుంచి పాల్గొంటున్న ధనుష్ శ్రీకాంత్ ఎంత వరకు రాణిస్తారు..? కప్ సాధిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Leave a Reply