నివాళులు అర్పిస్తున్న బార్ అసోసియేషన్ నాయకులు…

నివాళులు అర్పిస్తున్న బార్ అసోసియేషన్ నాయకులు…

జగమెరిగిన జన నాయకుడు జగజ్జీవన్ రాం

విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : అట్టడుగు వర్గాలకు సేవచేసి అండగా నిలిచిన నాయకుడు బాబు జగజ్జీవన్ రాం అని ది బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. లక్ష్మీనారాయణ ، బార్ కౌన్సిల్ సభ్యులు సి హెచ్ అజయకుమార్, మాజీ అధ్యక్షుడు వేముల హజరత్తయ్య గుప్త అన్నారు. బాబు జగజ్జీవన్ రాం జయంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రాంగణంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి కిరణ్, కోశాధికారి పద్మజ, స్పోర్ట్స్, లైబ్రరీ సెక్రటరీలో రవికిరణ్, శ్రీకాంత్ పర్యవేక్షించగా గుప్తా మాట్లాడుతూ జగమెరిగిన జనమెరిగిన జననాయకుడు జగజ్జీవనుడని అన్నారు. జగమున్నంత కాలం జన హృదయ నేత నాయకుడు అని పేర్కొన్నారు.జవజీవాలు భారతీయ చరిత్రకి నింపిన స్వాతంత్ర్య సమరయోధుడని కీర్తించారు.ప్రజల సంక్షేమ దిశగా ప్రణాళికలు
రచించి ముప్పది వత్సరాలు బడుగు వారి పట్ల మాత్సర్యం చూపిన మంత్రి అని అన్నారు. గాంధీజీ ఆశయాలకు ప్రేరణ ,ఊపిరిగా నిలించిన బహుజన ప్రియ నాయకుడు అని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజారత్నం, కోటేశ్వర రావు, ప్రసాద్, మోహన్, గవాస్కర్, డేవిడ్, ప్రధాన కార్యదర్శి కిరణ్ ఉపాధ్యక్షుడు లెనిన్ తదితరులు పాల్గొన్నారు.