సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి: సతీష్ రెడ్డి

కడెం, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో రేపు జరగనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం కడెం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నిర్మల్ జిల్లా బాసరలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా ప్రతి మండలం నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply