HYD | బ‌స్సు డ్రైవ‌ర్‌పై యువ‌కుల దాడి

HYD | బ‌స్సు డ్రైవ‌ర్‌పై యువ‌కుల దాడి

HYD | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కారుకు సైడ్ ఇవ్వ‌లేద‌ని రెచ్చిపోయారు. ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌పై దాడి చేయ‌డ‌మే కాకుండా బ‌స్సు అద్దాలను ధ్వంసం చేశారు. ప‌టాన్‌చెరు నుంచి కోఠికి వెళ్తున్న బర్కత్‌పురా డిపో బస్సు తమ కారుకు సైడ్‌ ఇవ్వలేదని ఆగ్ర‌హించారు. మాదాపూర్‌ వద్ద ఓవర్‌టేక్‌ చేసి బస్సును అడ్డుకున్నారు. బ‌స్సుకు కారును అడ్డంగా నిలిపి డ్రైవర్‌పై యువ‌కులు దాడి చేశారు. రాళ్ల‌ను బస్సు అద్దాలపై విసిరారు. ఈ ఘటనలో అటుగా వెళ్తున్న మ‌రో వాహ‌న‌దారుడికి రాయి తగిలి తీవ్రగాయాలయ్యాయి. దాడి తర్వాత ఇద్దరు యువకులు, యువతి కారులో పరారయ్యారు. బస్సు డ్రైవర్ మొయినుద్దీన్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Leave a Reply