Updates | యుద్ధం తాజా స‌మాచారం…

Updates | యుద్ధం తాజా స‌మాచారం…

Updates | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

అప్‌డేట్ చేయ‌బ‌డిన తేదీ, స‌మ‌యం 2 : 30 PM, 08.03.2026

Trump | ట్రంప్‌కు త‌గిన‌ శిక్ష వేస్తాం….

తమ నాయకుడి ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని హెచ్చరించారు. ఖమేనీపై దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని అలీ లారిజాని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. మేము ట్రంప్‌ను వదిలిపెట్టం, ఖమేనీ మృతికి ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. దాడుల్లో మా నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది సాధారణ విషయం కాదు. దీనికి తగిన రీతిలో మేం ప్రతీకారం తీర్చుకుంటామని మండిపడ్డారు.

ఇరాన్‌ దాడుల్లో ఆరుగురు యూఎస్ సైనికులే మృతి చెందారని ట్రంప్‌ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారు. కానీ అనేక మంది అమెరికన్‌ సైనికులను తాము బంధించామని అలీ మరో పోస్టు పెట్టారు. వెనెజువెలాలో మాదిరిగా ఇరాన్‌లో కూడా త్వరగా యుద్ధం ముగించేయాలనుకున్నారని, కానీ అది విఫలమైందని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, యూఎస్‌ సైనికులను బంధించామంటూ లారిజాని చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది.

Trump |
Trump |
Trump |
Trump |

అప్‌డేట్ చేయ‌బ‌డిన తేదీ, స‌మ‌యం 5 : 15 PM, 05.03.2026

ఇరాన్‌లో 1260కి చేరిన మృతుల సంఖ్య..

మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య యుద్ధం పూర్తి స్థాయి రణరంగంగా మారిపోయింది. తాజా దాడులతో ఇరాన్‌లో మృతుల సంఖ్య 1,260కి చేరుకుంది. పరస్పర వైమానిక దాడులు, మిసైల్ దాడులు, డ్రోన్ దాడులతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్, యూఏఈలోని 20కిపైగా అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి.

ఈ పరిణామాలతో పశ్చిమాసియా మరింత ఉద్రిక్తంగా మారింది. గల్ఫ్ దేశాలు, లెబనాన్, సిరియా వంటి ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడ్డాయి. ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని అత్యంత ఆందోళనతో పర్యవేక్షిస్తున్నాయి.

Updates |
Updates |

——————————————————————————-

అప్‌డేట్ చేయ‌బ‌డిన తేదీ, స‌మ‌యం 3 : 15 PM, 05.03.2026

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై ఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంలో భారత్‌ సంతాపం తెలిపింది.

భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ.. మన దేశం తరఫున సంతాప సందేశాన్ని ఇరాన్ కార్యాలయంలో రాశారు. ప్రస్తుతం ఇరాన్ లో జరుగుతున్న పరిస్థిలపై ఇరాన్ రాయబారితో విక్రమ్ మిస్రీ చర్చలు జరిపారు.

Updates |
Updates |

CLICK HERE TO READ MORE :Internet | అప్రకటిత ఎమర్జెన్సీ

CLICK HERE TO READ MORE

Leave a Reply